రాడార్ ప్రాజెక్ట్‌పై రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్

by karthikeya |   ( Updated:2024-10-15 06:59:55.0  )
రాడార్ ప్రాజెక్ట్‌పై రాజకీయం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్విటర్ వార్
X

దిశ, వెబ్‌డెస్క్: దామగుండంలో ఈ రోజు (మంగళవారం) శంకుస్థాపన జరగబోతున్న నేవీ రాడార్ స్టేషన్ చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్‌ పార్టీకి, అధికార కాంగ్రెస్‌కు మధ్య సీరియస్ ఫైట్ మొదలైంది. ఒకపక్క రాడార్ ప్రాజెక్ట్‌‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమవుతుంటే.. మరోపక్క బీఆర్ఎస్‌ కావాలనే రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దామగుండం ప్రాజెక్ట్‌ నిర్మిస్తే మూసీ నది కనుమరుగవుతుందని, మూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు తమ ప్రభుత్వంపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వేల ఎకరాల అటవీ భూములను నాశనం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రాడార్ సెంటర్లు జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాలి కానీ, జనావాసాల మధ్య కాదని హితవు పలికారు.

ఇక కేటీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎంవో కూడా ఎక్స్ వేదికగానే గట్టి కౌంటర్ ఇచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, అనుమతులన్నీ ఆ పార్టీ హయాంలోనే వచ్చాయని పేర్కొంది. వాళ్ల ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్ట్‌ను ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తుండడం విడ్డూరమని, గతంలో ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయడం ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేసింది.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ రాడార్ ప్రాజెక్ట్ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోందంటూ మండిపడ్డారు.

Read More : బీఆర్ఎస్ రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Read More : ప్రభుత్వ నిర్ణయంతో దామగుండం అడవికి ముప్పు..కళ్లముందే ప్రకృతి నాశనం అవుతున్నా ఆపేదెవరు?​ నేవీ రాడార్ స్టేషన్‌తో 12 లక్షల చెట్లు నరికివేత!

Advertisement

Next Story