బీఆర్ఎస్‌కు షాకిచ్చిన స్పీకర్.. వాయిదా తీర్మానం రిజెక్ట్

by Satheesh |
బీఆర్ఎస్‌కు షాకిచ్చిన స్పీకర్.. వాయిదా తీర్మానం రిజెక్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు నిరుద్యోగుల ఇతర న్యాయపరమైన డిమాండ్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వాయిదా తీర్మానం ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపాదించిన ఈ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. బీఆర్ఎస్ కోరిన అంశాలపై చర్చ జరిపేందుకు స్పీకర్ తిరస్కరించారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు అసెంబ్లీ సెషన్ హాట్ హాట్ సాగుతోంది. ఆర్టీసీపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది.

Advertisement

Next Story