BREAKING: రాబోయే లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: రాబోయే లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ నిజమాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో బూటకపు హామీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని, మళ్లీ అవే హామీలతో ప్రజలకు మోసం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, మేధావులు పోరాటంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు గ్యారంటీ అని స్పష్టం చేశారు. దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం ఖాయమని అని ధర్మపురి అర్వింద్ అన్నారు.

Advertisement

Next Story