- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ట్విస్ట్.. ఓట్ల లెక్కింపును బాయ్‌కాట్ చేసిన బీఆర్ఎస్
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కౌంటింగ్ ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీవ్ర అభ్యతంతం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, తనకు లీడ్‌లో చాలా వ్యత్యాసం వస్తుందని ఆరోపించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఏజెంట్ల సంతకాలు లేకుండానే ఫలితాలు ప్రకటిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులతో కలిసి బెదిరిస్తున్నారని తెలిపారు.
కౌంటింగ్ హాళ్లలో ఫలితాలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని, హాల్-4లో మేము 539 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ ఉంటే అంతా గోల్ మాల్ చేశారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఫలితాలను ప్రకటిస్తున్నారని అందుకే కౌంటింగ్‌ను తాము బహిష్కరిస్తున్నామని రాకేష్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్ జరిగిన తీరుపై త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్న 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యత సాధించగా.. మొత్తం మూడు రౌండ్లు కలిపి 17 వేల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నట్లుగా సమాచారం.