BREAKING : రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

by Sathputhe Rajesh |   ( Updated:2024-08-03 06:42:56.0  )
BREAKING : రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్‌ను రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్‌ను ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కే.శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. వాణిజ పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్. హరీష్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed