- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మా పథకాలను చూసి ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు: మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతిపక్షాలకు ఏమాత్రం మింగుడుపడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండలో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తాము 90 రోజులలోపే అమలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఒక ఇంటికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి స్థలం ఉన్నా లేకపోయిన నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల తరువాత నిరుపేదల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయబోతోందని అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను అధిష్టానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకని, అమెరికా నుంచి ఊడిపడి ఎమ్మెల్యే అయ్యాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి అసలు కేటీఆర్ పోటీయే కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక ఢోకా లేదని, రాబోయే 20 ఏళ్లు తాము అధికారంలో ఉండటం పక్కా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.