BREAKING: సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ప్రారంభం.. పంప్ హౌజ్-2‌ను స్విచ్ ఆన్ చేసిన సీఎం రేవంత్

by Shiva |
BREAKING: సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ప్రారంభం.. పంప్ హౌజ్-2‌ను స్విచ్ ఆన్ చేసిన సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌, రాజీవ్ కెనాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్‌-2ను స్విచ్చాన్‌ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. కాగా, ఈ పథకం కింద సుమారరు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల ఇప్పటికే వాడుకలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌజ్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఇక ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌజ్‌-3ని రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed