Breaking: తెగిపోయిన పాలేరు బ్రిడ్జి..తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

by Maddikunta Saikiran |
Breaking: తెగిపోయిన పాలేరు బ్రిడ్జి..తెలంగాణ-ఏపీ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం,నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రవహించడంతో ఆంధ్రా వైపున వచ్చే రహదారి మార్గంలోని పాలేరు బ్రిడ్జి తెగిపోయింది. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలను ఆధికారులు పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జి తెగిపోవడంతో కోదాడ వైపు వెళ్లే ప్రజలు, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు తక్కెళ్లపాడు, గరికపాడు, బలుసుపాడు, రెడ్లకుంట, రామాపురం x రోడ్, అన్నవరం గ్రామాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed