- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Johnny Master లైంగిక వేధింపుల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల(Sexual harassment)కు పాల్పడ్డాడని కేసు నమోదైంది. ఈ క్రమంలో గురువారం జానీని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఉప్పర్‌పల్లి కోర్ట్ అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అతన్ని జైలుకు తరలించారు. కాగా పోలీసుల రిమాండ్ రిపోర్టు(Remand Report)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
2019లో బాధితురాలితో జానీకి పరిచయం అయిందని, ఆ సమయంలోనే దురుద్దేశంతో ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని, 2020లో ముంబయిలోని ఓ హోటల్ లో జానీ మాస్టర్ యువతిపై లైంగిక దాడి(sexual assault) చేశాడని, ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు అని తెలిపారు. అలాగే ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు యువతికి సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, ఇండస్ట్రీలో అతనికి ఉన్న పలుకుబడితో బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశాడు. అలాగే జానీ మాస్టర్ భార్య అయేషా కూడా యువతిని పలుమార్లు బెదిరించిందని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు.