- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: వాళ్లకు మాత్రమే ‘రైతు భరోసా’ అందుతుంది: మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు రుణమాఫీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు సంబంధించి విధివిధానాలు మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రైతు సంఘాల నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సంఘాల నేతలతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. అర్హులకు మాత్రమే రైతు భరోసా పథకం అందుతుందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిజమైన రైతులు మోసపోయారని గుర్తు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘రైతు భరోసా’పై అసెంబ్లీలో చర్చ పెడతామని తెలిపారు. ఇచ్చిన మాటల మేరకు ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.