బిగ్ బ్రేకింగ్ : కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 09:15:04.0  )
బిగ్ బ్రేకింగ్ : కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఈ నెల 24న జరగనున్నందున అప్పటివరకూ గడువు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన మెయిల్‌కి ఈడీ స్పందించింది. ఈనెల 20వ తేదీన విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు గురువారం హాజరుకావాల్సిన ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. ఎంక్వయిరీకి రాలేనంటూ ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం పంపారు.

గత విచారణలో భాగంగా అధికారులు అడిగిన డాక్యుమెంట్లను తన లాయర్ సోమాభరత్ ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ...తదుపరి ఎంక్వయిరీ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కవితకు రామచంద్ర పిళ్లయ్ బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేసిన ఈడీ పిళ్లై, కవిత, బుచ్చిబాబులను కలిసి ప్రశ్నించాలని చూస్తున్నది. అయితే, కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నందున 24 తర్వాత విచారణకు హాజరవుతానని, మరొక తేదీ ఇవ్వాలని ఈడీని కోరగా...ముందే హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో మరోసారి కవిత విచారణకు హాజరవుతారా? లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Read more:

ఈడీ విచారణకు గైర్హాజరు.. కవిత ప్లాన్ ఇదేనా?

Advertisement

Next Story