BREAKING: పార్టీ ఫిరాయింపులపై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్.. ఎమ్మెల్యేలకు కీలక సూచన

by Shiva |
BREAKING: పార్టీ ఫిరాయింపులపై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్.. ఎమ్మెల్యేలకు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరగుతోంది. మరోవైపు స్థానికల ఎన్నికల కంటే ముందే మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్కెచ్ వేశారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో వారితో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం పార్టీలో జరగుతున్న పరిణామాలపై గులాబీ బాస్ వారితో చర్చించారు. పోచారం లాంటి వారు పార్టీ మారడాన్ని ఏ మాత్రం పట్టించుకోవద్దని వారికి కేసీఆర్ సూచించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదంటూ కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి చాలా జరిగినా.. తమ ఎమ్మెల్యేలు ఏ మాత్రం తొణకలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు, ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని, శాంతిభద్రతలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌ పార్టీకి మంచి రోజులు వస్తాయని.. అప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులను తరచూ కలుస్తానంటూ కేసీఆర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed