BREAKING: రైతులను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
BREAKING: రైతులను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్‌ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్లే పంటలు ఎండుతున్నాయని అనడం హాస్యాస్పదమని అన్నారు. ప్రకృతి కారణంగానే రాష్ట్రంలో కరువొచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17కు 17 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed