- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కేటీఆర్‌కు కేసీఆర్ పొలిటికల్ కోచింగ్ ఇవ్వాలి: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు పొలిటికల్ కోచింగ్ ఇప్పించాలంటూ కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సలహా ఇచ్చారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్‌కు తెలియదని కామెంట్ చేశారు. దేశం కోసం రాజీవ్ గాంధీ మిలిటెంట్ల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని అది ఎవరూ చెరపలేని చరిత్ర అని అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఈ రాష్ట్రాన్ని పాలించేందుకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారని ఇందులో కేటీఆర్‌కు కలుగుతున్న బాధ ఏంటో తమకు అర్థం కాలేదని అన్నారు.
సచివాలయం ముందు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ మాజీ ప్రధాని విగ్రహాన్ని పెడితే ఇంత అక్కసు ఎందకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏం ఆలస్యం కాలేదని.. కేటీఆర్‌కు కేసీఆర్ కాస్త పొలిటికల్‌గా ట్రైనింగ్ ఇస్తే మంచిదని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. ఢిల్లీ గులామ్‌లు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారని.. వారిలా కన్నింగ్ నేచర్ తమది కాదని అన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తరువాత ఇదే కేటీఆర్ కుటుంబం కట్టగట్టుకుని సోనియా ఇంటికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆయన తెచ్చిన టెక్నాలజీతోనే కేటీఆర్ చేదువుకున్నారని.. ఇప్పడు కల్లు తాగిన కోతిలా కేటీఆర్ మాట్టాడుతున్నారని ఫైర్ అయ్యారు.