- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: కాంగ్రెస్ పాలనపై అక్కసుతోనే కేసీఆర్ దుమ్మెత్తిపోశారు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పాలనపై అక్కసుతోనే కేసీఆర్ దుమ్మెత్తిపోశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక సమస్యలకు గత బీఆర్ఎస్ పాలనే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు. పదేళ్ల చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత 3 నెలల నుంచి గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కట్టిన ఇంటిని కేసీఆర్ తగులబెట్టిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత కేసీఆర్ బయటకు వచ్చారంటూ సెటైర్లు వేశారు. అసలు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మించిన స్థలం సరైంది కాదని ఆయన అన్నారు.
పర్యావరణ అనుమతులు తెచ్చుకోకపోవడం వల్లే యాదాద్రి ప్రాజెక్ట్ ఆలస్యమైందని వెల్లడించారు. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును కేసీఆర్ ఇప్పటికి ఒప్పుకోవడం లేదని అన్నారు. ప్రజలకు తప్పదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. NTPC విషయంలోనూ అబద్ధాలు చెప్పారంటంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగానే కరెంట్ సరఫరా జరగుతోందని వెల్లడించారు. ఒక్క విద్యుత్ రంగంలోనే రూ.1,10,690 కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిపారు.