- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన KCR
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టును మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సోమవారం ఆశ్రయించారు. రైలు రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. ప్రజా ప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టేయాలంటూ పిటిషన్‌లో కేసీఆర్ కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారని పోలీసులు తెలిపారు. రైలు రోకో వల్ల రైలు రాకపోకలు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్‌లో తెలిపారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ కేసుకు ఎలాంటి బలం లేదని కేసీఆర్ పిటిషన్‌లో తెలిపారు.