BREAKING: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. మరోసారి సత్తాచాటిన తెలుగు తేజాలు

by Disha Web Desk 1 |
BREAKING: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. మరోసారి సత్తాచాటిన తెలుగు తేజాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇవాళ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను UPSC బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 147 మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణులైనట్లుగా కమిషన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పోతుపురెడ్డి భార్గవ్‌కు 22వ ర్యాంకు, మన్నెం అజయ్ కుమార్‌కు 44వ ర్యాంకు, భార్గవ్ కుమార్‌ 124వ ర్యాంక్ సాధించారు. జనరల్‌ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

టాప్‌ టెన్ ర్యాంకర్లు వీరే...

రిత్విక పాండే

కాలె ప్రతీక్ష నానా సాహెబ్‌

స్వస్తిక్‌ యదువంశీ

పండిట్‌ షిరిన్‌ సంజయ్‌

విద్యాన్షు శేఖర్‌ ఝా

రోహన్‌ తివారి

కావ్య వైఎస్‌

ఆదర్శ్‌ జి

పంకజ్‌ చౌధరి

శశాంక్‌ భరద్వాజ్‌

Read More...

తెలంగాణలో ఏస్థానంలో ఏ పార్టీ గెలవబోతోంది?.. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో సంచలన విషయాలు



Next Story