- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రైతులకు భారీ గుడ్ న్యూస్.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాలను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల మేరకు 25 భూసార పరీక్షా కేంద్రాలను మనుగడలోకి తీసుకురావాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అవన్నీ ప్రస్తుతం మూతపడే స్థితి చేరుకున్నాయని ఆరోపించారు.
భూసార పరీక్షల వల్ల మట్టి స్వభావం తెలుసుకోవచ్చని, నేల స్వభావం మేరకు పోషకాలు, సేంద్రియ, రసాయన ఎరువుల వినియోగం ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష చేసిన నేలకు అనుకూలమైన పంటలను వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు. అదేవిధంగా భూసార పరీక్షా కేంద్రాల వల్ల సాగు ఖర్చు బాగా తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో 9, ఒక చోట ప్రాంతీయ భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్ యార్డుల్లో 14, ఒక చోట మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు.