BREAKING: ఇసుక అమ్మకాలకు ప్రభుత్వం కొత్త పాలసీ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ

by Shiva |   ( Updated:2024-02-08 16:00:43.0  )
BREAKING: ఇసుక అమ్మకాలకు ప్రభుత్వం కొత్త పాలసీ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో ఇసుక అక్రమ రవాణాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని, ఇసుక దందా అవినీతిమయంగా మారిందని అన్నారు. మైనింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళణ చేయాలని పేర్కొన్నారు. కొందరు అక్రమార్కులతో అధికారులు చేతులు కలిపి అక్రమ దందాలకు తెర లేపినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఈ విషయంలో 48 గంటల్లో అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ అధికారులతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి టీఎస్ఎండీసీ (TSMDC)లో అక్రమాలను అరికట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధ్యులు ఎంతటి వారైనా.. వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అదేవిధంగా ఇసుక అమ్మకాలకు సంబంధించి కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోకి ఇసుక పాలసీలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.

Advertisement

Next Story