- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking : యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బల్మూరి వెంకట్‌ను ఎన్నుకోవద్దు : కాంగ్రెస్ ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో త్వరలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, NSUI రాష్ట్ర అధ్యక్షుడు , ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు సొంత పార్టీ లోనే చుక్కెదురయింది. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా వెంకట్‌ను గెలవనీయకుండా పార్టీలో కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, బల్మూరి వెంకట్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ రోజు రామగుండంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో కార్యకర్తలతో పెట్టిన మీటింగులో ఎమ్మెల్యే మాట్లాడూతూ.. 'త్వరలో జరిగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బల్మూరి వెంకట్ కు ఓటేయొద్దని కార్యకర్తలకు మక్కాన్ సింగ్ పిలుపునిచ్చారు. ఒక్కరికే రెండు పదవులు ఎందుకని ప్రశ్నించారు. వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి ఉండగా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకని, బల్మూరికి కాకుండా ఒక సామాన్య వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వాలని' కాంగ్రెస్ పెద్దలను బాహాటంగానే ప్రశ్నించాడు.దీంతో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది.