BREAKING: కేసీఆర్‌ను తిట్టడం అంటే.. తెలంగాణను తిట్టినట్టే: హరీష్‌రావు హాట్ కామెంట్స్

by Shiva |
BREAKING: కేసీఆర్‌ను తిట్టడం అంటే.. తెలంగాణను తిట్టినట్టే: హరీష్‌రావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్‌ను తిట్టడం అంటే.. తెలంగాణను తిట్టినట్టేనని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కుక్కునూరుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో ప్రజలకు ఆపాయం ఉందని, ఐదు నెలల రేవంత్‌రెడ్డి పాలనలో అప్పుడే మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తానని చెప్పిన హమీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రూ.500 గ్యాస్ సిలిండర్ ఇంత వరకు ఊసే లేదని అన్నారు. జనం వద్దురో.. నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నాడని మండిపడ్డారు. ఆసలు ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలనే జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. ఆయనే తెలంగాణ తీసుకురాకపోతే రాష్ట్రానికి రేవంత్ సీఎం అయ్యేవాడు కాదని, అదే ఆంధ్రోళ్ల కాళ్లు వత్తుకుంటూ కూర్చునేవాడని కామెంట్ చేశారు.

Advertisement

Next Story