- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సర్పంచ్‌లను బిచ్చగాళ్లను చేసిన బీఆర్ఎస్ : ఎంపీ బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడిందని, సర్పంచ్‌లను సైతం బిచ్చగాళ్లును చేశారంటూ ఎంపీ బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు ఏనాడు పట్టించుకుండా ఫాం హౌజ్‌లో పడుకున్న కేసీఆర్.. నేడు నన్ను ఓడించేందుకు కరీంనగర్‌కు వస్తున్నాడట అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వచ్చే ముందు పదేళ్లు అధికారులో ఉండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల్లో అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు విడుదల చేయకుండా వారి ఆత్మహత్యకు కారణం ఎవరయ్యారో అందరికీ తెలుసని అన్నారు.
బూటకపు హామీలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో రైతులను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ఏక కాలంలో రూ.2లక్షల రుణ మాఫీ అంటూ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని, అసలు సీన్లో బీఆర్ఆర్ లేనేలేదని ఎద్దేవా చేశారు. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలకు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Read More..