- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌కు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డ అన్నారు. ఇవాళ ములుగులో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ తాత్కాలిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ మాలోతు కవిత పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ములుగులో గిరిజన వర్సిటీ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గిరిజనులకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా వర్సిటీకి భూమి ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం జాప్యం చేసిందంటూ మండిపడ్డారు. కొత్త ప్రభుత్వమైనా యూనివర్సిటీకి కనీసం 50 ఎకరాలైన కేటాయించాలని కోరారు. గిరిజన వర్సిటీ, రిజర్వేషన్ల పెంపునకు సీతారాం నాయక్ పోరాటం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా రూ.60 కోట్లతో రామప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే వర్సిటీ గిరిజనుల జీవితాల్లో గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని బదలాయిస్తే శాశ్వత నిర్మాణాలు చేపడుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.