- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ నేతలు కళ్లెం సురేందర్‌రెడ్డి, జిట్ట రాజేందర్‌రెడ్డి, కళ్లెం మోహన్‌రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్‌రెడ్డి తనయుడు ముదిగంటి వెంకట్ శ్రీనివాస్‌రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు వారికి కిషన్ రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా, రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్త నేతలను ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నుంచి మెజారిటీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారే ఉన్నారు.