- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్!.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ జి.వివేకానంద ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఒకవైపు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆయన పార్టీ స్టేట్ చీఫ్‌కు రాజీనామా లేఖను పంపారు. నిమిషాల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ దగ్గరకు చేరారు. విజయభేరి బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీని కలవడానికి కుటుంబ సమేతంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు వెళ్ళారు. కుమారుడు వంశీతో పాటు కలిసి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూరు స్థానం నుంచి వివేక్ పోటీచేస్తారా?.. లేక ఆయన కుమారుడిని పోటీ చేయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
బీజేపీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న వివేక్ పార్టీని వీడనున్నట్లు చాలాకాలంగా వార్తలు వెలువడ్డాయి. ఆ పార్టీలో ఈటల రాజేందర్‌తో విభేదాలు తారస్థాయి చేరడంతో చివరకు బయటకు రావాలనే నిర్ణయమే తీసుకున్నారు. బీఆర్ఎస్‌లో చేరాలా?.. లేక కాంగ్రెస్‌లో చేరాలా?.. అనే విషయమై సుదీర్ఘంగా తన సన్నిహితులతో చర్చించారు. మూడు రోజుల క్రితం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఊహాగానాలు వినిపించాయి. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి కాంగ్రెస్‌లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటీవలే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. రానున్న రోజుల్లో ఇంకెంతమంది వస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రజల కోసమే చేరాను : వివేక్
“తెలంగాణ సాధనలో నేను సిట్టింగ్ ఎంపీగా అప్పట్లో కొట్లాడాను. రాష్ట్రం రావడానికి కాంగ్రెస్ ఎంపీగా నా వంతు ప్రయత్నం చేశాను. నేను కోరుకున్న లక్ష్యం నెరవేరింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్ళాను. తెలంగాణ బాగుపడుతుందని అందరూ అనుకున్నారు. తొమ్మిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రజలను నిర్లక్ష్యం చేశారు. ప్రజలు చాలా అసృంతృప్తితో ఉన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే అవసరం కోసమే పార్టీలో చేరాను. టికెట్ వస్తుందా?.. రాదా? .. అనేది ముఖ్యం కాదు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాను.
సొంత గూటికి చేరారు : రేవంత్
వివేక్ తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు పనిచేశారని, వినోద్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని, తాజాగా వివేక్ కూడా చేరారని పీసీసీ చీఫ్ రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో వెంకటస్వామి కుటుంబంలోని మూడు తరాలకు అనుబంధం ఉన్నదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని నమ్మినందున ఇప్పుడు చేరారని, ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు.