- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: నగరవాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షం కురిసే ఛాన్స్, అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

X
దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది గంటల్లోనే పొలింగ్ ఉందనగా హైదరాబాద్‌పై వరుణ దేవుడు తన ప్రతాపాన్ని చూపబోతున్నాడు. ఈ మేరకు సాయంత్రం నగర వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత మంగళవారం సాయంత్రం కురిసిన భారీ ఈదరుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగింది. పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటలను తలపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. నాలాలు, మ్యాన్‌హోల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
Next Story