BREAKING: పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలెట్‌తో సహా ముగ్గురు క్షేమం

by Shiva |   ( Updated:2024-09-05 08:04:21.0  )
BREAKING: పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలెట్‌తో సహా ముగ్గురు క్షేమం
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ క్షేత్రంలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామం వద్ద చోటుచేసుకుంది. వారం క్రితం విజయవాడలో వదర సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ చిట్యాల మండలం వనిపాకల గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, హెలికాప్టర్‌లో ఉన్న పైలెట్‌తో ఇద్దరు సురక్షితంగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed