- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kiran Abbavaram: ఈ కథ బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కోసమే రాసుకున్నా.. ‘క’ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ (Periodic Thriller) సినిమా ‘క’ (ka). సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ (Action Thriller) కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఇందులో నయన్ సారిక (Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Ram) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఎంతో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ‘క’ మూవీ దీపావళి స్పెషల్ (Special)గా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ (theatrical) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీని తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి (Vamsi Nandipati), మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తన వేఫర్ ఫిలింస్‌పై రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగంగా.. తాజాగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.
డైరెక్టర్ సందీప్ (Sandeep) మాట్లాడుతూ.. ‘‘క’ ట్రైలర్ (Trailer) మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఈ కథను బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ (audience) కోసం రాసుకున్నాం. స్క్రీన్ ప్లే (screen play) కూడా అలాగే చేశాం. కథ చెప్పగానే కిరణ్ వెంటనే ఓకే చేశారు. ఆయన ఇచ్చిన కాన్పిడెన్స్ (Confidence)తో కంటిన్యూ (Continued) అయ్యాం. అంతే కాదు స్క్రిప్ట్ ఓకే అయ్యాక కిరణ్ మాకు చాలా ఫ్రీడమ్ (freedom) ఇచ్చారు. మనకు కథల కంటే కథను కొత్తగా చెప్పడమే ఇంపార్టెంట్ (Important). అలా "క" సినిమాను స్క్రీన్ మీద కొత్తగా ప్రెజెంట్ చేశాం. 1970, 80 కాలాన్ని ప్రతిబింబించేలా ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నాం. కృష్ణగిరి అనే ఊరు యూనిక్‌గా ఉండేలా మధ్యాహ్నం చీకటి పడే ఎలిమెంట్ (element) తీసుకున్నాం. సినిమా బిగిన్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే క ప్రపంచంలోకి వెళ్తారు, వాసుదేవ్ క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతారు’ అని చెప్పుకొచ్చారు.