- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్.. విమానంలో 130 మంది?
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)కు బాంబు బెదిరింపు (Bomb Threatening Call) కాల్ వచ్చింది. ఇండిగో విమానం(Indigo)లో బాంబు ఉందని ఫోన్ కాల్ రావడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు కాల్ తో.. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దింపేశారు. విమానంలో బాంబు స్క్వాడ్, ఎయిర్ పోర్టు పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు చేశారు ? అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల భారత్ కు చెందిన వివిధ విమానాలకు వారంరోజుల వ్యవధిలో 100 కు పైగా బెదిరింపులు వచ్చాయి. దీనిపై కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బెదిరింపులు పోస్ట్ చేస్తుంటే.. మీరేం చేస్తున్నారని ఎక్స్ ప్రతినిధులపై ఫైర్ అయింది. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బెదిరింపులకు పాల్పడిన వారిని నో ఫ్లైయింగ్ లిస్టులో చేర్చుతామని, అందుకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేస్తామని చెప్పారు.