ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులదే కీలక పాత్ర: బోయినపల్లి వినోద్

by Satheesh |
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులదే కీలక పాత్ర: బోయినపల్లి వినోద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరూ ప్రభుత్వానికి ఎప్పటిలాగే సహకరించాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంఘం తెలంగాణ ఉద్యోగుల సంఘం అని పేర్కొన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన పోరాట సందర్భాలను బోయినపల్లి వినోద్ నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అలాగే ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి రిటైర్డ్ అయినప్పటికీ తెలంగాణ ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారానికి నిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ తన బాధ్యత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో సీఎంను ఢిల్లీలో కలిసి ఉద్యోగుల పలు సమస్యల పట్ల చర్చించారన్నారు. టీచర్ల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి, ప్రెసిడెంట్ ఎం. రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సి. హరీష్ కుమార్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ ఎన్. నర్సింగ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed