- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీకోటి ప్రవీణ్ కు బీజేపీ కీలక హామీ.. టికెట్ దక్కక పోవడానికి రీజన్ చెప్పిన క్యాసినో కింగ్
దిశ, డైనమిక్ బ్యూరో:తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన జహీరాబాద్ ఎంపీ టికెట్ ను ఆశించారు. అయితే అక్కడ మరొకరికి అవకాశం కల్పించడం పట్ల ఓ ఛానెల్ తో మాట్లాడిన చీకోటి.. కొన్ని అనివార్య కారణాల వల్ల తనకు జహీరాబాద్ టికెట్ దక్కలేదని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి రావడం వల్ల అధిష్టానం అయనే అవకాశం కల్పించిందన్నారు. అయితే తనకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. తాను పార్టీ నుంచి కమిట్ మెంట్ అడిగే వ్యక్తిని కాదని మోడీ కోసం పని చేస్తాన్నారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తానన్నారు. తాను పార్టీకి దూరంగా లేనని ప్రజల మధ్యనే ఉన్నానన్నారు. ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని త్వరలో రాష్ట్ర స్థాయిలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తానన్నారు.
కేటీఆర్ కు సిగ్గుండాలి:
నా ఫోన్ ట్యాపింగ్ అయిందని గతంలోనే ఆరోపించానని కానీ అప్పుడు పట్టించుకోలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చిందెవరో గుర్తించాలన్నారు. కొంత మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తే చేసిండవచ్చన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అలా అనడానికి కేటీఆర్ కు సిగ్గుండాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ ఉన్నాడని అనుకుంటునన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు చేశారు కాబట్టే కవిత జైలుకు పోయారని అన్నారు. కవిత అరెస్ట్ వెనుక బీజేపీ ప్రమేయం లేదన్నారు.