- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో బీజేపీ సెన్సేషనల్ మీటింగ్.. ఒకే వేదికపై మోడీ, షా, నడ్డా?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కేంద్రంగా కార్యక్రమాలకు బీజేపీ పావులు కదుపుతున్నది. హైదరాబాద్‌లో జులై 8న 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, సంస్థాగత కార్యదర్శులతో మీటింగ్ నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు సీనియర్ నేత అమిత్ షా హాజరవుతున్నారు. ప్రధాని మోడీ సైతం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీవర్గాలు పేర్కొన్నా.. పీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే స్పష్టత రానున్నది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సంస్థాగత కార్యదర్శి సునీల్ బన్సల్, ఇన్‌చార్జి తరుణ్ చుగ్, సహ ఇన్‌చార్జి అరవింద్ మీనన్ తదితరులు కూడా రానున్నారు. ఏయే రాష్ట్రాల నేతలు పాల్గొంటున్నారనేదానిపై రాష్ట్రపార్టీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
బహిరంగసభకు ప్లాన్
హైదరాబాద్‌లో ఒక రోజు జరిగే మీటింగ్ తర్వాత భారీ బహిరంగసభ ఉందని అంటున్నా, నిర్దిష్ట షెడ్యూలు తయారైన తర్వాత మరింత క్లారిటీ వస్తుందని రాష్ట్రనేతలు పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోడీ సభ కోసం ప్లాన్ చేసినా కొన్నికారణాలతో వాయిదా పడింది. ఖమ్మం కేంద్రంగా అమిత్ షా జూన్ 15న హాజరయ్యే సభ కూడా వాయిదా పడింది తెలిసిందే. మరోసారి బహిరంగసభ ఏర్పాటుపై రాష్ట్ర పార్టీవర్గాలు ఆలోచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు.. ప్రజలను పార్టీవైపు తిప్పుకునేందుకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కలిసి పబ్లిక్ మీటింగ్ అవసరమని రాష్ట్ర యూనిట్ నుంచి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు విజ్ఞప్తి వెళ్లనున్నది.