- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పిన కేసీఆర్ లెక్క.. మునుగోడు ముంగిట బీజేపీ మాస్టర్ ప్లాన్!
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ వ్యూహ రచన చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని పేరుంది. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకునే నిర్ణయాల వెనుకు పక్కా ప్రణాళిక ఉంటుందనే చర్చ ఉంది. ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించుకున్నాకే అడుగు ముందుకు వేస్తారని సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతల్లోనూ ఉన్న అభిప్రాయం. ఇన్నాళ్లు ఉద్యమ పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జాతీయ పార్టీగా మార్చుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో అంచనాలు వేయడంలో సిద్ధహస్తుడిగా పేరున్న కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీ స్కెచ్‌తో బిగ్ షాక్ తగిలిందా అనే చర్చ తెరపైకి వస్తోంది. మునుగోడు ముంగిట టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెళ్తూ వెళ్తూ కేసీఆర్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేలా చేయడం వెనుక కమలం పార్టీ భారీ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామం మునుగోడు బై ఎలక్షన్‌కు ముందు జరిగినప్పటికీ దీని వెను అసలైన టార్గెట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అనే విషయం స్పష్టం అవుతోంది. ఇందుకు బూర నర్సయ్య తన రాజీనామా లేఖలో లేవనెత్తిన అంశాలే ఉదాహరణలు అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బూర నర్సయ్య విషయంలో కేసీఆర్ అంచనా తప్పిందా? అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఆ విషయాన్ని కేసీఆర్ పసిగట్టలేకపోయారా?:
రాజకీయంగా కేసీఆర్ తన చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట. ఎవరిని ఎప్పుడు దగ్గరకు తీయాలి ఎవరిని ఎప్పుడు దూరం చేయాలో కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన మాజీ సహచరులు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ ఎపిసోడ్‌లో కేసీఆర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే అనుమానంతోనే ఈటలపై కేసీఆర్ పార్టీలో పొగరాజేశారనే టాక్ వినిపించింది. ఈటల ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సమాచారంతోనే పార్టీలో సుదీర్ఘ కాలం తనతో కలిసి పని చేసిన ఈటలపై కేసీఆర్ ముప్పెట దాడికి దిగినట్లు ప్రచారం జరిగింది. ఈటల విషయంలో ముందుగానే అంచనా వేసుకున్న కేసీఆర్ మరి బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేస్తున్నాడన్న విషయాన్ని ముందే ఎందుకు పసిగట్టలేక పోయారనే వాదన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై బూర నర్సయ్య గౌడ్ ఆకస్మాత్తుగా ఏమి ఆరోపించలేదు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పలు సందర్భాల్లో ఆయన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తన నిర్ణయాలకు, తన ఆలోచన విధానాలను కానీ కాసింత క్రాస్ చేసిన సహించని కేసీఆర్.. బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేసే వరకు ఆ సంగతి పసిగట్టలేకపోయారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నమే చేశారు తప్ప ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని కేసీఆర్ భావించి ఉండరనేది ఇక్కడే కేసీఆర్ లెక్క తప్పిందా అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
టార్గెట్ 2023?:
రాజకీయాల్లో సిన్సియర్‌గా పేరుగాంచిన నర్సయ్య గౌడ్ రాజీనామా లేఖ పరిశీలిస్తే తాను పార్టీని వీడుతూనే కేసీఆర్‌ను ఓ రకమైన డిఫెన్స్‌లోకి నెట్టినట్లు అర్థం అవుతోంది. ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న కుట్రలు, అవమానాలతో పాటు తమలాంటి వారి గోడును చెప్పుకునేందుకు కేసీఆర్ వద్దకు వెళ్లడానికి దారులు మూసుకుపోయిన తీరును ఆయన తన రాజీనామా లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న ధరణి, జీపీ లేఔట్స్ రిజిస్ట్రేషన్ బ్యాన్, దళితుల అసైన్డ్ భూమల్లో లే ఔట్స్, సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్, కుల వృత్తుల ఫెడరేషన్స్ నిర్వీర్యం చేయడం, బీసీ, ఈబీసీ పేద పిల్లలకు కేవలం 11 శాతం వరకే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం వంటి నిర్ణయాలు చాలా పెద్ద తప్పిదాలు అని ఆయన పేర్కొన్నారు. వీటివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని అన్నారు. అలాగే కాంట్రాక్టులు అన్ని ఆంధ్ర ప్రాంతం వారికి అప్పగించడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్‌ను కనీసం ఒక్క నిమిషం కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తోందని పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ అంశాలన్నింటిపై చాలా కాలంగా బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్నప్పటికీ తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ సైతం ఇవే ఆరోపణలు చేయడంతో కేసీఆర్‌ను ఢిఫెన్స్‌లోకి నెట్టినట్లైందనే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు చెప్పిన మాటలు ఇప్పుడు టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కీలక నేతలు చెప్పడంతో ఆ ఇంపాక్ట్ ప్రజల్లోకి స్పీడ్‌గా చేరుతుందనే అంచనాలు బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశాలన్నింటిపై బీజేపీ మరింత ఫోకస్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తే అది టీఆర్ఎస్‌కు బిగ్ మైనస్ కావొచ్చనే చర్చ జరుగుతోంది. బూర నర్సయ్య తన రాజీనామా లేఖలో క్షేత్ర స్థాయిలోని ప్రధాన వర్గాలను ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. రైతులు, విద్యార్థులు, రాజకీయ నేతలు కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురవుతున్న అంశాలనే ఆయన టార్గెట్ చేశారు. దాంతో ఈ పరిణామం తక్షణం మునుగోడులో అనుకూలించడంతో పాటు భవిష్యత్‌లో రాబోయే ఎన్నికల్లో తమకు మరింత కలిసొచ్చేలా బీజేపీ మలుచుకోబోతుందనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.