- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలో బీజేపీకి అధికారం అందని ద్రాక్షే’
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీజేపీకి అధికారమనేది అందని దాక్షేనని, కేసీఆర్ ఉన్నంత వరకు ఆ పార్టీకి అధికారం కలగానే మిగులుతుందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజేపీ పోరాటం చేసిందన్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమన్నారు.
కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎవరొచ్చినా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిట్టడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. పదవులను తృణప్రాయంగా త్యజించి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన నేత కేసీఆర్ అన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలుసునన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప.. రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని చూసి కేంద్రం కళ్లు మండుతున్నాయని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదన్న దుగ్దతోనే కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో బీజేపీకి గుణ పాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు.