బీజేపీ భరోసా ఇస్తుంది.. అన్ని నియోజకవర్గాల్లో 11 వేల సభలు : స్టేట్​ వైస్ ​ప్రెసిడెంట్​ కాసం వెంకటేశ్వర్లు

by Vinod kumar |
బీజేపీ భరోసా ఇస్తుంది.. అన్ని నియోజకవర్గాల్లో 11 వేల సభలు : స్టేట్​ వైస్ ​ప్రెసిడెంట్​ కాసం వెంకటేశ్వర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ ​సాగిస్తున్న నియంతృత్వ, అవినీతి పూరిత పాలనల నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని ఆదరించాల్సిన అవసరం ఉన్నదని ఆ పార్టీ స్టేట్​వైస్​ప్రెసిడెంట్ డాక్టర్ ​కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్ట్రీట్​కార్నర్​మీటింగ్‌లకు ప్రజల నుంచి భారీ మద్ధతు లభిస్తోందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో 11 వేల సభలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల ఫిబ్రవరి 10న మొదలై ఇప్పటివరకు 1608 కేంద్రాల్లో స్ట్రీట్​కార్నర్​మీటింగులు జరిగాయన్నారు. కేసీఆర్​అరాచక పాలనకు చెక్​పెట్టేందుకు ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్నారు. ప్రజల నుంచి స్పందన ను పరిశీలిస్తే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అవినీతి లేకుండా ప్రతి పథకాన్ని పేదలకు చేర్చుతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Advertisement

Next Story