- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రంహ వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని అన్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడిలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంపై ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేవైఎం నేతలు ప్రయత్నించగా ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొంతమంది నేతలకు గాయాలయ్యాయి. మరికొంత మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనలో బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డారు.
అతడికి ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బండి సంజయ్ కరీంనగర్ పర్యటనలో నుంచే ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆందోళనలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడటంపై బండి సంజయ్ మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, కేసీఆర్ సర్కార్‌కు పోయే కాలం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఎస్సై పరీక్షలో తొమ్మిది మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో ఏడు మార్కులను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ మార్కులను కలపాల్సిందే అని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది.