మల్లారెడ్డికి మంత్రి పదవిలో ఉండే అర్హతే లేదు.. బీజేపీ నేత శాంతి కుమార్

by Javid Pasha |   ( Updated:2022-11-24 17:32:00.0  )
మల్లారెడ్డికి మంత్రి పదవిలో ఉండే అర్హతే లేదు.. బీజేపీ నేత శాంతి కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డికి మంత్రి పదవిలో ఉండే అర్హత కూడా లేదని, మంత్రి పదవిలో ఉండి కూడా సర్క్ వారెంట్ ను చింపేసి ల్యాప్ టాప్ ను లాక్కున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి విద్యాసంస్థలపై సర్చ్ వారెంట్ తో ఐటీ సోదాలు నిర్వహించిందని, మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇండ్లు, కళాశాలలు, కార్యాలయాల్లో చేసిన ఐటీ సోదాల్లో రూ.18 కోట్లు దొరికాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.500 నుంచి రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా రూ.వంద కోట్లు సంపాదించారన్నారు. మంత్రి పదవిలో ఉన్న మల్లారెడ్డి వారెంట్ ను చింపేశారని, అసలు ఆయనకు మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా అని శాంతి కుమార్ ప్రశ్నించారు.

ఐటీ సోదాలు చేస్తే బీజేపీ చేయిస్తోందని ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆక్రమిత స్థలాల్లో కాలేజీలు కట్టించిన మల్లారెడ్డి ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయించడంపై శాంతి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఅర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీ అధికారుల విధులకు ఆటంకాలు కలిగించి.. తప్పించుకోవడానికి అధికారులపై కేసులు పెట్టారన్నారు. మల్లారెడ్డి అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, మల్లారెడ్డి దీని నుంచి తప్పించుకోలేరని, శిక్ష అనుభవించక తప్పదని శాంతి కుమార్ హెచ్చరించారు.


చరిత్ర తిరగ రాయండి.. కేంద్రం మద్దతు ఉంటుంది: అమిత్ షా


Advertisement

Next Story