మహిళా కమిషన్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే

by GSrikanth |
మహిళా కమిషన్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులకు సంబంధించిన అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు నోటీసులు అందితే తప్పనిసరిగా మహిళా కమిషన్ ఎదుట హాజరవుతానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కాగా తన కేసుకు సంబంధించి సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఇతరుల విషయంలో ఎందుకు చేపట్టలేదనే అంశంపై చర్చిస్తానని పేర్కొన్నారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ అనరాని వ్యాఖ్యలు అన్నారని, అంతేకాకుండా ఎంతో మంది సామాన్యులపై జరుగుతున్న అంశాలను సుమోటోగా స్వీకరించకుండా ఏం చేస్తున్నట్లనే అంశాలపై మహిళా కమిషన్ తో చర్చిస్తానని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed