- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల, కోమటిరెడ్డి పార్టీ మార్పు వార్తల వేళ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ నేతలు ఇతర పార్టీలకు మారబోరని, ఒకవేళ పార్టీ మారినా అలాంటి వారిని ఆపబోమని, మునిగిపోయే నావలో ఎక్కితే వాళ్ళకే నష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదివాస్ను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి అని కొనియాడారు. అతి చిన్న వయసులోనే జాతీయవాదాన్ని వినిపించిన వ్యక్తి అని పేర్కొన్నారు.
ఆయన లేకుంటే జమ్మూకాశ్మీర్ దేశంలో అంతర్భాగమై ఉండేది కాదన్నారు. కలకత్తా బంగ్లాదేశ్లో భాగమయ్యేదని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ దేశ విభజనకు సహకరిస్తూ.. ఇతర దేశాలకు కొమ్ము కాశారని ఫైరయ్యారు. ఒకప్పుడు కలకత్తా నుంచి జమ్మూకు వెళ్లేందుకు అనుమతి లేదని, దేశంలోని ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు అనుమతి ఎందుకు అని పోరాడిన వ్యక్తి ముఖర్జీ అని బండి సంజయ్ కొనియాడారు.
370 ఆర్టికల్ రద్దు కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కలకత్తాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను బలితీసుకుందని, ఆమె వెళ్లి మోడీ, షా అపాయింట్ మెంట్ కోరినా ఇస్తారని వెల్లడించారు. కేసీఆర్ లాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వకుండా వారు ఉండరని చురకలంటించారు. అలాంటిది తమ పార్టీ నేతలు ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్తే ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వరని, తమ పార్టీలో ఎవరైనా మోడీని కలవచ్చని తెలిపారు.
కేసీఆర్ కావాలనే, కొన్ని మీడియా చానళ్లను అడ్డు పెట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇష్యూను డైవర్ట్ చేయాలని చూస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ మీటింగ్కు రాకుంటే రూ.100 ఫైన్ వేస్తారా? అని బండి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 9 ఏండ్లు పూర్తయితే దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బండి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి మానసిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని బండి చురకలంటించారు. హుజురాబాద్, ఎమ్మెల్సీ, మునుగోడులో ఎవరి మానసిక పరిస్థితి బాగలేక ప్రజలు ఓట్లు వేయలేదో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉండాలని, వాళ్ళు అవే విషయాలు మాట్లాడుకోవాలని, అప్పుడే తమ పార్టీ బలోపేతం కావాలన్నారు.
Read More... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కోవడం ఖాయం : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్