రాహుల్‌కు బీజేపీ వెంటనే సారీ చెప్పాలి: మల్లు రవి డిమాండ్

by Satheesh |   ( Updated:2023-03-14 15:18:21.0  )
రాహుల్‌కు బీజేపీ వెంటనే సారీ చెప్పాలి: మల్లు రవి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్​గాంధీకి బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్​పార్టీ సీనియర్​టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్​చేశారు. రాహుల్​దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎక్కడా మాట్లాడలేదని మల్లు రవి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. గాంధీభవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మోదీ నియంతృత్వంపై , అణచివేత ధోరణిపై రాహుల్ లండన్‌లో మాట్లాడారన్నారు. మోదీ పాలనలో అరాచకం జరుగుతున్నదన్నారు.

పార్లమెంట్‌లో అదానీ ఇష్యూ పక్కకు పోయేలా రాహుల్ అంశంపై చర్చకు తెచ్చారన్నారు. అదానీ ఇష్యూపై కమిటీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా, బీజేపీ స్పందించడం లేదన్నారు. ఇక కాంగ్రెస్‌లోని సీనియర్లు కేసీఆర్‌కు అమ్ముడు పోయారు అని రేవంత్ రెడ్డి అనలేదన్నారు. గతంలో పార్టీ మారిన కొందరు సీనియర్లను ఉద్దేశించి ఆ వాఖ్యలు చేసినట్లు మల్లు రవి గుర్తు చేశారు. ఈ నెల 16 నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం అవుతుందని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, భట్టి ఇద్దరు అవగాహనతోనే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు మల్లు రవి క్లారిటీ ఇచ్చారు.

పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్​మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ తన విధులు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఇప్పటి వరకు 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. కనీసం ఒక్క నియామకం జరగలేదన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీలో ఒక క్లార్క్‌ను బాధ్యులను చేసి అసలు దోషులను తప్పిస్తున్నట్లు వెల్లడించారు. పేపర్ లీక్‌లో మంత్రులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత్ర ఉన్నదన్నారు.

టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ.. అందులో ఎగ్జామ్ రాయడం క్రిమినల్ చర్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. కష్టపడి చదువుకున్న విద్యార్థుల కష్టాన్ని బుగ్గిపాలు చేశారన్నారు. వెంటనే జనార్ధన్ రెడ్డి‌ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతేగాక పేపర్​లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ ఇష్యూపై మంత్రి కేటిఆర్ బాధ్యత వహించాలన్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లలో ఎప్పటికీ లోపాలు ఉంటాయన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed