రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీని బొంద పెట్టాలి

by Sridhar Babu |   ( Updated:2024-05-09 14:25:22.0  )
రిజర్వేషన్లు రద్దు చేసే  బీజేపీని బొంద పెట్టాలి
X

దిశ, నర్సాపూర్ : రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బొంద పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి దీపా దాస్ మున్షి, అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, జగ్గారెడ్డి, హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ శ్రీరాముడు, హనుమంతుడు వంటి దేవుళ్ల పేరు చెప్పి ఓట్ల బిచ్చం అడుక్కుంటుందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మాటతప్పిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ను

దుబ్బాక ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బండ కేసి కొట్టారని అన్నారు. జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు లకు ఒక్క మగాడు కూడా దొరకలేదని ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని విమర్శించిన కేసీఆర్ ఇకనైనా బుద్ధి తెచ్చుకో అన్నారు. ఐఐటి త్రిబుల్ ఐటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు అడిగితే కనీసం గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ దేశానికి మార్గదర్శకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 17 స్థానాలలో 14 స్థానాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. అనంతరం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి అధికారం రాబోతుందని అన్నారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిందని, చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో తనలాంటి ఎంతోమందికి గుర్తింపు దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, పటాన్​చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల మల్లేశం, సీనియర్ నాయకులు పులిమామిడి రాజు, చిట్టి దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, నాయకులు మణిదీప్ సుధీర్ రెడ్డి, హరీష్ తో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More...

‘ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలో లేదు.. రాదు’: మంత్రి కోమటిరెడ్డి

Advertisement

Next Story