- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రేపు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ సంస్థాగత ఇన్ చార్జీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జీ అభయ్ పాటిల్ గురువారం తెలంగాణకు రానున్నారు. జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదుపై వారు సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం సభ్యత్వ నమోదు అంశానికి సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ నమోదుకు నియమించిన జిల్లా ఇన్ చార్జీలతో వారు భేటీ అవ్వనున్నారు. శుక్రవారం బీజేపీలో వివిధ మోర్చాల నేతలతో వారు సమావేశమవ్వనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సభ్యత్వ నమోదు ప్రభారీలను, సహ ప్రభారీలను రాష్ట్ర నాయకత్వం నియమించింది. జిల్లాలవారీగా సభ్యత్వాల బాధ్యత, సమన్వయం, నిర్వహణ వారికే అప్పగించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పార్టీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. కాగా ఇప్పటికే పలు సమావేశాలు చేపట్టిన బీజేపీ నాయకత్వం నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. వాస్తవానికి ఈనెల 2 నుంచే సభ్యత్వ నమోదు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం వాయిదా వేసింది. త్వరలోనే తేదీని ఫిక్స్ చేస్తామని స్పష్టంచేసింది. ఈనేపథ్యంలో బన్సల్, అభయ్ పాటిల్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.