- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, కేటీఆర్ మత్తు వదిలి రైతుల గురించి పట్టించుకోవాలి.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్, కేటీఆర్ మత్తు వదిలి రైతుల గురించి పట్టించుకోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో రైతు ఉత్పత్తి దారుల కంపెనీని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్ సంఘం సభ్యుల సహకారంతో గోదామును ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆర్గానికి వ్యవసాయంపై రైతులు దృష్టిపెట్టాలని కోరారు. అకాల వర్షాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారన్న ఎంపీ.. కేసీఆర్ మాత్రం రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భారీ వర్షాలకు వడ్లు మొలకెత్తాయని, నష్టపోయిన రైతులకు రూ.10 వేల నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ హామీలకే పరిమితమయ్యారే తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే నెరవేర్చాలని సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు మనసుంటే.. మార్గం నేను చూపిస్తా : ఎంపీ ధర్మపురి అరవింద్