- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బిహార్ సీఎం అమాయకుడు.. కేసీఆర్ ఉచ్చులో చిక్కుకున్నాడు'
దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ తెలంగాణ పరువు తీశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి కూర్చోవడానికి నితీష్ కుమార్ సిద్ధంగా లేరని ఇక కలిసి ఏం పోరాటం చేస్తారని ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. సాయం ముసుగులో కేసీఆర్ బిహార్ వెళ్లి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో భారత సైన్యం పట్ల అవమానకరంగా మాట్లాడిన కేసీఆర్ ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిహార్‌లో జరిగింది పచ్చి అవకాశవాదుల సమావేశం అని, తెలంగాణలో చెల్లని రూపాయి బిహార్‌లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే, ప్రాజెక్టు భూ నిర్వాసితులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు మరణిస్తే వారికి ఆదుకోవడానికి చేతులు రాని కేసీఆర్ బిహార్‌లో సాయం పేరుతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
దుబ్బాక, హుజురాబాద్‌లో చావుదెబ్బతిన్న టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చుచేసినా రేపు మునుగోడులోనూ దెబ్బతింటుందని జోస్యం చెప్పారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది బీజేపీయేనని స్పష్టం చేశారు. కేసీఆర్ చర్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నితీష్ కుమార్ అమాయకుడని కేసీఆర్ ఉచ్చులో పడి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రధాని దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల 30 లక్షల మందికి ఇళ్లు కట్టించారని పట్టణ ప్రాంతాల్లో 60 లక్షల మందికి ఇళ్లు కట్టించారని ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఇళ్లు కట్టించారని ప్రశ్నించారు. బావిలో కప్పలా కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఒకసారి అందులోనుంచి బయటకు వస్తే మోడీ హయాంలో దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుస్తుందన్నారు.
రాష్ట్రాల వాటా కేటాయించకపోవడం వల్లే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ రాక్షస పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేశారని అన్నారు. పోటీ చేయకముందు కలుస్తారా లేక పోటీ చేశాక కలుస్తారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ రెండు పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రైతు సంఘాల ప్రమేయం లేకుండా ఇతర రాష్ట్రాల రైతు సంఘాలతో భేటీలు హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కాదని టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మునుగోడులో పరిస్థితి తేటతెల్లం కావడం వల్లే కేంద్రంపై నిధుల పేరుతో కొత్త విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. తోక పార్టీలు అని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు కమ్యూనిస్టులకు ఆపద్భాందవుడుగా మారాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పొత్తులపై..
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి ముందుకు వెళ్లనుందని ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఈ అంశంపై లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో ఎటువంటి చర్చలు జరగలేదని అన్నారు. టీడీపీతో పొత్తు అనేది జరుగుతున్న ప్రచారమేనన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ముందుకు వెళ్తోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
Also Read : 'నితీష్, కేసీఆర్ కలలు కంటున్నారు.. ముందు ఆ పని చేస్తే బాగుంటుంది'