- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్: లక్ష్మణ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోవడంతో పాటు కాంగ్రెస్ నేతల అంతర్గత తన్నులాటలతో మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కుప్పకూలిపోవడం ఖాయమని ఇరు పార్టీలకు చెందిన నేతలు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని.. దమ్ముంటే టచ్ చేసి చూడండని బీజేపీ, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పట్ల విశ్వాసం పోయి ఇరు పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందనడానికి ఈ చేరికలే నిదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖతం కాబోతుందని.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నిలక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తుండగా.. బీజేపీ కీలక నేత లక్ష్మణ్ సైతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందని పొలిటికల్ కారిడార్‌లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.