ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది: MP లక్ష్మణ్

by GSrikanth |
ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది: MP లక్ష్మణ్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్ధవంతంగా జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పదేళ్ల మోడీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చించామని తెలిపారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక హామీలు గుప్పించారని గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చాక అమలు సాధ్యంకాక చేతులెత్తేశారని విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేయించేవరకు తాము ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని తెలిపారు. నరేంద్ర మోడీ చేత హ్యాట్రిక్ కొట్టించి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాలని దేశ యువత ఉత్సాహంగా ఉందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed