- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీలకు పెద్ద పీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్: BJP MP
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. నాగోల్‌లో నిర్వహించిన ఓబీసీ మోర్చా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కిచెప్పారు. బీసీలకు పెద్ద పీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. కానీ, బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహి అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ సోదరులకు కొమ్ము కాస్తోందని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీల సీట్లలో ముస్లింలకు అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పైనా ఉందని, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందకు చేయలేదో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు.