బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర కేసీఆర్ది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

by Javid Pasha |
బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర కేసీఆర్ది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. నాగోల్ లో నిర్వహించిన ఓబీసీ మోర్చా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీసీల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కిచెప్పారు. బీసీలకు పెద్ద పీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని తెలిపారు. కానీ బీసీల రిజర్వేషన్లను కుదించిన చరిత్ర సీఎం కేసీఆర్ ది అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ద్రోహి అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ సోదరులకు కొమ్ము కాస్తోందని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీల సీట్లలో ముస్లింలకు అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పైనా ఉందని, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed