- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ స్టీరింగ్ బీఆర్ఎస్ చేతిలో.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటే కాంగ్రెస్ స్టీరింగ్ బీఆర్ఎస్ చేతిలో ఉందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ కు బీఆర్‌ఎస్ బీ టీం కాదని, కాంగ్రెస్ ఏ1, బీఆర్ఎస్ ఏ2, ఎంఐఎం ఏ3 అని అన్నారు. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ జై కొట్టడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంగతనం బయటపడిందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ లో చేరకుండా కేసీఆర్ తెలంగాణ పేదలకు 35 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లేలా చేశాడన్నారు. 9 ఏళ్లలో పంట నష్టానికి ఒక్క రూపాయి ఇయ్యలేదని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ఆర్ఐలను తడిగుడ్డతో గొంతుకోశాడని, 18 గంటలు పనిచేసే ప్రధానిపై ఫార్మ్ హౌస్ లో పడుకునే నువ్వా అవిశ్వాసం పెట్టేది అని నిలదీశారు.
కడెం ప్రాజెక్టు గతేడాది ఏ స్టేజీలో ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు. ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినట్లు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. రైలు ప్రమాదం జరిగితే ప్రధాని సందర్శించారని, రైల్వే శాఖ మంత్రి అక్కడే ఉండి రైలు ప్రయాణాలు మొదలైయ్యేదాకా అక్కడే ఉన్నారని గుర్తుచేశారు. కానీ వర్షాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో పడుకున్నాడని విమర్శించారు. మంత్రి కేటీఆర్, కవిత ఎక్కడున్నారు? కేసీఆర్ అసలు నువ్వు మనిషివేనా? సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ మండిపడ్డారు. పేదలకు మంచి చేసినందుకేనా ప్రధానిపై అవిశ్వాసం పెట్టిందని ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు.
కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసేవాళ్లకు కాంగ్రెస్ లో పదవులు ఇవ్వడంలేదన్నారు. ఇండియా కూటమి కాదు ఇటలీ కూటమి పెట్టి ఉంటే ఖర్గే శాశ్వతంగా ప్రెసిడెంట్ గా ఉండేవారని విమర్శించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయని, బయటకు వెళ్ళందంటూ పోలీసులే మెసేజ్‌లు పెడుతున్నారని చెప్పారు. ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే కాంట్రాక్ట్ లు ఇస్తే రోడ్లు ఇలాగే అధ్వానంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్‌లో గెలిచినవాళ్ళను పార్టీలో చేర్చుకోవాలనే కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుల నియామకం సంస్థగత నిర్ణయం తీసుకుంటుందన్నారు. దాంట్లో తాను చేసేది ఏం లేదన్నారు. పార్టీ పెరుగుతున్నప్పుడు మార్పులు చేర్పులు సహజమని పేర్కొన్నారు.