కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది: బండి సంజయ్

by GSrikanth |
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులను రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500 సాయంపై ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రైతుభరోసా రూ.15 వేలు ఏమైందని రైతులు అడుగుతున్నట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. కుట్ర పూరితంగానే ఈ రెండు పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరం అంటే.. బీఆర్ఎస్ కృష్ణా వాటర్ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే.. బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వట్లేదని అంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed